తాండూరు కళాకారులకు రాష్ట్ర స్థాయి గురురత్న అవార్డు

ABN , First Publish Date - 2020-12-28T05:16:31+05:30 IST

తాండూరు కళాకారులకు రాష్ట్ర స్థాయి గురురత్న అవార్డు

తాండూరు కళాకారులకు రాష్ట్ర స్థాయి గురురత్న అవార్డు
గురు రత్న అవార్డు అందుకుంటున్న గణేష్‌

తాండూరు : వికారాబాద్‌ జిల్లా తాం డూరు కళాకారులు రాష్ట్రస్థాయిలో గురుర త్న అవార్డులు అందుకున్నారు. సిరిసిల్లలో శ్రీ లంబోదర కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన 5వ ఉమ్మడి తెలుగు రాష్ట్రస్థాయి బాలల కళోత్సవాల్లో భాగంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరుకు పట్టణానికి చెందిన ఎస్‌.గోపాల్‌ మాస్టర్‌ (వరుణ్‌ డాన్స్‌ స్టూడియో), రమేష్‌ మాస్టర్‌(స్వస్తిక్‌ డాన్స్‌ ఆర్ట్స్‌ అకాడమీ)లను గురు రత్న అవార్డులతో సన్మానించారు. ఈ సందర్భంగా మాస్టర్లు గోపాల్‌, రమేష్‌ మాట్లాడుతూ తాండూరుకు చెందిన తమను గుర్తించి, అవార్డులతో సత్కరించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో తాండూరుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.     

Updated Date - 2020-12-28T05:16:31+05:30 IST