తీరిన గ్రాసం కొరత

ABN , First Publish Date - 2020-12-26T04:15:10+05:30 IST

రెండు మూడే ళ్లుగా సరైన వర్షాలు లేక పశు వులు గడ్డి దొరకక అల్లాడి పోయాయి.

తీరిన గ్రాసం కొరత
కొనేవారు లేక రెండు రోజులుగా మంగల్‌పల్లి వద్ద ఆగిఉన్న గడ్డి లారీ

  • వర్షాలు సరిపడా కురవడంతో మేతకు లేదు చింత
  • నాడు గ్రాసం కోసం రైతుల పరుగులు
  • నేడు కొనేవారు లేక రోడ్డుపై నిలిచిన గడ్డి లారీలు


ఆదిభట్ల : రెండు మూడే ళ్లుగా సరైన వర్షాలు లేక పశు వులు గడ్డి దొరకక అల్లాడి పోయాయి. వర్షాభావ పరిస్థి తుల కారణంగా పాడి రైతులు పశు గ్రాసం కొరతను ఎదుర్కొ న్నారు. భూమిపై పచ్చదనం లేక బీడులుగా మారిన పరిస్థితుల్లో పశువుల మేత కోసం ఎండి గడ్డి కొందామన్న దొరకలేదు. పాడి పశువులను రక్షించుకునేందుకు రైతులు వేలాది రూపాయలు వె చ్చించి ఇతర ప్రాంతాల నుంచి వరిగడ్డిని కొని తెచ్చుకునేవారు. కానీ ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురియడంతో రైతుకు గడ్డి చింత తీరింది. వర్షాలకు భూమిపై పచ్చదనం పెరిగి పశువులకు సరిపోను గ్రాసం దొరుకుతోంది. వరి పంటలు కూడా బాగానే పండటంతో ఎండు గడ్డి కూడా స్థానికంగా దొరుకుతోంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలకు వరిగడ్డిని తీసుకు వచ్చి వ్యాపారం చేసుకునే వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది. లారీలు, ట్రాక్టర్ల నిండా గడ్డి తెచ్చి రోడ్డు మీద ఉంచినా.. కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రోజుల తరబడి గడ్డి వాహనాల వద్ద జాగారం చేసినా రైతులెవరూ ఆ వైపే చూడటం లేదు. చేసేదేమి లేక కొందరు వ్యాపారులు తెచ్చిన గడ్డిని తిరిగి తీసుకెళ్తున్నారు. 


 పశు గ్రాసం కొరత తీరినట్లే..

గతంలో పశువులకు మేత లేక చాలా కష్టాలు పడేటోల్లం. గ్రాసం లేక మూగజీవాలు అల్లాడు తుంటే చూడలేక  పోచం పల్లి, మెదక్‌, నాగార్జున సాగర్‌ పరిసర ప్రాంతాల నుంచి వరి గడ్డి తెప్పించేవాళ్లం. ట్రాక్టర్‌ గడ్డికి రూ.11వేలు, లారీ గడ్డికి రూ.35వేల వరకు వెచ్చించే  పరిస్థితి ఉండేది. ట్రాక్టర్‌ గడ్డి తెస్తే నెలరోజులు కూడా వచ్చేది కాదు. ఇటీవల కురిసిన వర్షాలకు పశువులు, జీవాలకు గ్రాసం దొరుకుతుంది. 

- కోరే లింగం, పాడిరైతు, ఆరుట్ల, మంచాల మండలంUpdated Date - 2020-12-26T04:15:10+05:30 IST