-
-
Home » Telangana » Rangareddy » greater
-
గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం
ABN , First Publish Date - 2020-11-26T05:16:52+05:30 IST
గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం

ఆమనగల్లు : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్ నాయకులు బిజీబిజీగా ఉన్నారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరానికి తరలివెళ్లారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన సైదాబాద్, జియాగూడ, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్‌నాకాలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయా చోట్ల జరిగిన ఎన్నికల ప్రచారాల్లో నాయకులు జర్పుల దశరథ్‌నాయక్, గంప వెంకటేశ్, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, సీఎల్ శ్రీనివా్‌సయాదవ్, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, కమ్లీమోత్యనాయక్, అనితవిజయ్, అనురాధపత్యనాయక్, శ్రీనివా్‌సరెడ్డి, లాయక్‌అలీ, గుర్రం కేశవులు, నిట్ట నారాయణ , తోట గిరియాదవ్, డాక్టర్ శ్రీను, రఘురాములు, జగన్‌రెడ్డి, రమేశ్‌నాయక్, నరేందర్‌నాయక్, దోనాదుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ నాయకుల విస్తృత ప్రచారం
షాద్‌నగర్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచన మేరకు స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడ కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి శిరీషయాదవ్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. షాద్‌నగర్ పట్టణంతో పాటు ఫరూఖ్‌నగర్, కొందుర్గు, కేశంపేట మండలాలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ నాయకులు గత మూడు రోజులుగా కాచిగూడ ప్రాంతంలో ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో-ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, ఫరూఖ్‌నగర్ జడ్పీటీసీ పి.వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ ఖాజాఇద్రీస్, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ పి.లక్ష్మీనర్సింహారెడ్డి, కౌన్సిలర్లు ఈశ్వర్‌రాజు, కానుగు అంతయ్య, నాయకులు శోభలక్ష్మణ్‌నాయక్, ఒగ్గు కిశోర్, జాంగారి నర్సింలు, మన్నె నారాయణ, ఆర్ల యాదయ్య, రవియాదవ్, శ్రీశైలంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.