సంజయ్‌కి నాయకుల స్వాగతం
ABN , First Publish Date - 2020-12-21T04:28:30+05:30 IST
సంజయ్‌కి నాయకుల స్వాగతం

- ఉమ్మడి జిల్లా ముఖ ద్వారం వద్ద బీజేపీ సందడి
కొత్తూర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముఖద్వారమైన కొత్తూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర్ ఆలయం వద్ద పార్టీ నాయకులు పెద్దయెత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. నారాయణపేట జిల్లాలో అదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సంజయ్‌కి బీజేపీ నాయకులు స్వాగతం పలికి, సత్కరించారు. సంజయ్ తిమ్మాపూర్ చేరుకోగానే నాయకులు ప్రధాని మోదీ, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సంజయ్ వెంట వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కూడా నాయకులు స్వాగతం పలికి సన్మానించారు. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శ్రీవర్ధన్‌రెడ్డి, శాంతికుమార్, చెంది మహేందర్‌రెడ్డి, దేపల్లి అశోక్‌గౌడ్, డాక్టర్ విజయ్‌కుమార్, కక్కనూరి వెంకటే్‌షగుప్తా, విష్ణువర్ధన్‌రెడ్డి, సుధాకర్, భూపాలచారి, అమడపురం నర్సింహాగౌడ్, బి. మాణిక్యం, మహేందర్‌రెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
మాజీ సర్పంచ్ బీజేపీలో చేరిక
నందిగామ మండలం చేగూర్ మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకురాలు మాణెమ్మ బీజేపీతో చేరారు. ఆమె తన అనుచరులతో తిమ్మాపూర్‌కు తరలివచ్చారు. వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.