బదిలీపై వెళ్లిన కలెక్టర్ ఎంవీ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు
ABN , First Publish Date - 2020-02-08T11:58:20+05:30 IST
ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉండడానికి బదిలీపై వెళ్లిన కలెక్టర్ ఎంవీ రెడ్డి కృషే కారణమని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు.

మేడ్చల్ అర్బన్: ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉండడానికి బదిలీపై వెళ్లిన కలెక్టర్ ఎంవీ రెడ్డి కృషే కారణమని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నల్సార్ వర్సీటీలో ఏర్పాటు చేసిన ఎంఈ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆయనకు జ్ఞాపికను అందజేసి మాట్లాడారు. పారిశ్రామిక జిల్లాగా పేరోందిన మేడ్చల్-మల్కాజిగిరిలో టీఎస్ ఐపాస్ ద్వారా ఎన్నో పరిశ్రమలు వచ్చాయాన్నరు. అనంతరం ఎంవీ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అన్ని రంగాల్లో ము ందుంచాలనే సంకల్పంతో పనిచేశానని, ఉ ద్యోగుల మద్దతు లేనిదే సాఽధ్యం కాదన్నారు. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. తర్వాత జిల్లాలోని ఉద్యోగులందరు భద్రాద్రికొత్తగూ డెం కలెక్టర్ ఎంవీ రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జేసీ విద్యాసాగర్, డీఆ ర్వో మఽధుకర్‌రెడ్డి, ఆర్డీవోలు రవి, మల్లయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.