గోవిందా.. గోవిందా

ABN , First Publish Date - 2020-03-02T10:48:17+05:30 IST

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆమగల్లు పట్టణంలోని వెంకటగిరి వేంకటేశ్వరస్వామి 120వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యా

గోవిందా.. గోవిందా

  • అట్టహాసంగా ప్రారంభమైన వేంకటగిరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
  • పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు
  • అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు

ఆమనగల్లు: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆమగల్లు పట్టణంలోని వెంకటగిరి వేంకటేశ్వరస్వామి 120వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోసం ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. 7వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు కొనసాగ నున్నాయి. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనార్థం పెద్దఎత్తున రానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు అన్ని వసతులను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతసేవలో భాగంగా మేలుకొలుపు పాడారు. అనంతరం ఆలయ మూలవిరాట్‌ను పట్టువస్ర్తాలతో అందంగా అలంక రించి పుణ్యహ వచనం, అంకురార్పణ, విశ్వక్‌సేన ఆరాధన, అభిషేకాలు, అగ్నిప్రతిష్ట, ఇతర ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఽప్రధాన అర్చకుడు గూడ క్రిష్ణమాచార్యులు ఆధ్వర్యంలో పూజా కృతువలు అట్టహాసంగా కొనసాగాయి. బ్రహ్మో త్సవాల నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రభుత్వాసుపత్రి వరకు రంగురంగుల విద్యుద్దీపాలను, మైకులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T10:48:17+05:30 IST