-
-
Home » Telangana » Rangareddy » Governments fail in job placements
-
ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వాలు విఫలం
ABN , First Publish Date - 2020-12-29T04:50:37+05:30 IST
ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వాలు విఫలం

వికారాబాద్ :నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ క్లబ్‌లో ఉద్యోగ, నిరుద్యోగ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, 2021 మార్చిలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.