ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలి

ABN , First Publish Date - 2020-06-26T10:03:46+05:30 IST

మండల పరిధిలోని రాకొండ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గురువారం తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌కు వినతిపత్రం

ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలి

దోమ: మండల పరిధిలోని రాకొండ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గురువారం తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గ్రామంలోని సర్వేనెంబరు 99, 100లో మజ్జిగ కిష్టమ్మ, శ్రీనివాస్‌, మహిపాల్‌లు భూమిని ఆక్రమించారని పేర్కొన్నారు. భూమిలో బోరు బావితో పాటు ఇతరత్రా కట్టడాలు చేపట్టారని వివరించారు. విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - 2020-06-26T10:03:46+05:30 IST