అన్నదాతకు ప్రభుత్వం అండ... అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు
ABN , First Publish Date - 2020-12-30T05:05:29+05:30 IST
అన్నదాతకు ప్రభుత్వం అండ... అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు
- అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో ఎమ్మెల్యేలు
కొడంగల్/కొడంగల్‌రూరల్/బొంరాస్‌పేట్/దౌల్తాబాద్: అన్నదాతను అన్ని విధాలుగా ఆదుకుంటూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బొంరా్‌సపేటలోని పెద్ద చెరువు తూమును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయకట్టు రైతులందరిని అన్నీ విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోట్లయాదగిరి, చాంద్‌పాష, శేరినారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, రామకృష్ణయాదవ్, లచ్చప్ప, వెంకటయ్య, శేఖర్‌గౌడ్, అంజిలయ్య, గోపాల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే దౌల్తాబాద్ మండలంలో పర్యటించారు. మండలంలోని పల్లె ప్రకృతివనం పరిశీలన, తిమ్మారెడ్డిపల్లి గ్రామం బంగ్లాతండాలో రూ.2 కోట్లతో బీటీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. అల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోట్లమహిపాల్, ఎంపీపీ పటేల్‌విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ప్రమోద్‌రావు, మోహన్‌రెడ్డి, జ్యోతి, భీములు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మున్సిపాలిటిలో అధికారులతో మాట్లాడారు. చిన్ననందిగామ గ్రామంలో బీటీరోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ టేకుల్‌కోడ్ సావిత్రమ్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటలక్ష్మి, అధికారులు,గోడల రాంరెడ్డి, మధుయాదవ్, దత్తురెడ్డి, సర్పంచ్‌లు అంజద్, సాయిలుపాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు
పరిగి/కులకచర /నవాబుపేట : పరిగి మునిసిపల్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మునిసిపల్‌లో అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిగిపట్టణంలో అండర్‌డ్రైనేజి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ ఎం.అశోక్, కమిషనర్ ప్రవీణ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించారు. నెలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని గుత్తేదారు అరవింద్‌రెడ్డిని ఆదేశించారు. కాగా గ్రామాల అభివృద్ధికి నిధుల కొరతలేదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. జాఫర్‌పల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, సర్పంచ్ యాదమ్మ, ప్రవీణ్‌రెడ్డి, సురేందర్ పాల్గొన్నారు. కులకచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మహే్‌షరెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
గ్రామాల అభివృద్ధే సీఎం లక్ష్యం
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్లఎమ్మెల్యేయాదయ్య అన్నారు.ఎల్లకొండగ్రామంలో సర్పంచ్ రావుగారి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం గ్రామంలోని ఓ మెడికల్ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జయమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, పీఆర్‌ఏఈ లక్ష్మయ్య, సర్పంచులు శ్రీనివా్‌సగౌడ్, బల్వంత్‌రెడ్డి, రఫి, విజయలక్ష్మి, విమలరంగారెడ్డి, ఎంపీటీసీ పద్మానాగిరెడ్డి, కందాడ నాగిరెడ్డి, ఆర్.వెంకట్‌రెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి, ఆనంద్‌రెడ్డి, తలారి ప్రభాకర్, ఏసుదాసు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీతోనే పేద ప్రజలకు మేలు
టీఆర్‌ఎస్ పార్టీతోనే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం బీరోల్ గ్రామంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌సపార్టీలో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యకళ, ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, రాంచంద్రారెడ్డి, అనిల్, వెంకటే్‌షయాదవ్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన మునిసిపల్ చైర్‌పర్సన్
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని 27వ వార్డు పోస్ట్ ఆఫీస్ కాలనీలో రూ.3లక్షల వ్యయంతో అండర్‌డ్రైనేజీ పైపులైన్, 4వ వార్డు శివారెడ్డిపేట్‌లోని శ్మశానవాటికకు రూ.5లక్షల వ్యయంతో నూతన కంపౌండ్ వాల్ నిర్మాణ పనులను మునిసిపల్ చైర్‌పర్సన్ మంజులరమేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సురేష్, నజ్రీన్,షరీ్‌ఫబేగం, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, మునిసిపల్ మాజీ వైస్‌చైర్మన్ రమే్‌షకుమార్ పాల్గొన్నారు.