ముందుంది.. మచ్చీకాలం.. మత్స్యకారులకు మంచి రోజులు

ABN , First Publish Date - 2020-07-28T17:08:19+05:30 IST

ఈసారి వర్షాలు బాగానే కురుస్తుండటంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధమవుతోంది.

ముందుంది.. మచ్చీకాలం.. మత్స్యకారులకు మంచి రోజులు

కురుస్తున్న వర్షాలు.. నిండుతున్న చెరువులు, కుంటలు

కోటి చేప పిల్లలను వదిలేందుకు సన్నాహాలు

త్వరలో పూర్తి కానున్న టెండరు ప్రక్రియ 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఈసారి వర్షాలు బాగానే కురుస్తుండటంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధమవుతోంది.  గతేడాది కోటి చేప విత్తనాలను పంపిణీ చేయగా, ఈసారి కూడా అదేస్థాయిలో అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈసారి కూడా మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


వర్షాలు కురుస్తు న్నాయి.. చెరువులు నిండుతు న్నాయి.. మత్స్యకారులకు మంచి రోజులు రానున్నాయి. చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు సన్నా హాలు చేస్తున్నారు. నీరున్న చెరు వులు, కుంటల్లో చేపపిల్లలను వది లేందుకు మత్స్యశాఖ సిద్ధమవుతోంది. ఆగస్టు రెండోవారంలో చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు కసరత్తు చేస్తు న్నారు. ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వందశాతం రాయితీపై చేపపిల్లల పంపిణీ  కార్య క్రమాన్ని మూడేళ్లుగా చేపడుతోంది. ఈసారి కూడా మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్తన చేప పిల్లలను ఇచ్చేందుకు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఏడాది కోటి చేప విత్తనాలను పంపిణీ చేయగా ఈసారి కూడా అదేస్థాయిలో చేప విత్తనాలను అందిం చేందుకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 


మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను చేపడుతుంది. అందులోభాగంగా చెరువులు, జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతు న్నారు. ఇదివరకు మత్స్యకారులు వ్యాపారుల సహాయంతో చెరు వుల్లో చేపవిత్తనం వేసే వారు. పంట వచ్చిన అనంతరం సదరు వ్యాపారులకే చెప్పిన రేటుకు అమ్మాల్సి వచ్చేది. దీంతో దళారులే లాభపడేవారు. ప్రభుత్వం ఉచి తంగా చేప పిల్లలను వదులు తుండటంతో మత్స్యకారులకు దళారుల బాధ తప్పింది. ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది కూడా జలవనరుల్లో చేప పిల్లలను వది లేందుకు మత్స్యశాఖ యంత్రాం గం సన్నద్ధమవుతుంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 532 నీటి వనరులు న్నాయి. సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వంద శాతం సబ్సిడీపై చేపవిత్తనాలు వేయాలని లక్ష్యంగా పెట్టు కోగా.. 326 చెరువుల్లో 70.13 లక్షల చేప పిల్లలను వదిలారు. ఇప్పటివరకు 3వేల టన్నుల ఉత్పత్తి జరి గింది. మరో 9వేల టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశాలున్నట్లు అధికారుల అంచనా. జిల్లాలో 99 మత్స్య పారి శ్రామిక సహకార సంఘాలు ఉండగా అందులో 5,941 సభ్యు లున్నారు. అలాగే తొమ్మిది మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా... అందులో 610సభ్యులున్నారు. వీరంతా మత్స్య సంపదను నమ్ము కొని జీవనం సాగిస్తున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో నెలక్రితం వరకు చేపల ఎగుమతికి ఆటంకాలు ఏర్పడ్డాయి. చెరువులు, కుం టల్లో పట్టిన చేపలను మత్స్యకారులు ఎక్కడికక్కడే విక్రయించారు. 


ఐదు రకాల చేప విత్తనాలు

రంగారెడ్డి జిల్లాలోని జల వనరుల్లో కోటి చేప పిల్లలను వద లడం లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది నాలుగు రకాల చేప పిల్లలను చెరువుల్లోకి వదలగా.. ఈసారి ఐదు రకాల చేప పిల్లలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం బొచ్చ, రవ్వ, బంగారు తీగ, కట్ల, రోహు కరాలను ఎంచుకున్నారు. నీటి వనరులను సీజనల్‌ చెరువులు, ఎల్లప్పుడూ నీటి లభ్యతగల చెరువులుగా విభజిస్తారు. సీజనల్‌ చెరువుల్లో ఆరు నెలల పాటు నీరు అందుబాటులో ఉండాలి. ఇలాంటి చెరువుల్లో బొచ్చ, రవ్వ, బంగారు తీగ విత్తనాలను వదులుతారు, వీటి సైజ్‌ 35 నుంచి 40 మిల్లీ మీటర్లు ఉంటుంది. ఏడాదిపాటు నీటి లభ్యత ఉండే చెరువుల్లో బొచ్చ, రవ్వ, మోసు రకాలను వేస్తారు. ఇవి 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు ఉంటాయి. నీరు ఎక్కువగా ఉన్న చెరువుల్లో పెద్ద సైజు చేప పిల్లలు, నీరు తక్కువగా ఉన్న చెరువుల్లో చిన్న సైజు చేప పిల్లలను వదలనున్నారు. 


కోటి చేప విత్తనాలు వేయాలని నిర్ణయించాం: సుకీర్తి, మత్స్యశాఖ రంగారెడ్డి జిల్లా అధికారి 

నీరున్న చెరువుల్లో మొదటి విడతగా చేప విత్తనాలను వదులు తాం. ఈ ఏడాది కూడా కోటి చేప విత్తనాలను వదిలేందుకు నిర్ణయిం చాము. దీనికి సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతుంది. ఏపీ లేదా తెలంగాణ నుంచి సీడ్‌ సరఫరా ఉం టుంది. వర్షాలు కురిసి ఆగాక ఎన్ని చెరువులు నిండాయి. ఏ చెరువులో ఎన్నిచేపలు వదలాలి అనే విషయాన్ని నిర్దారించాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-07-28T17:08:19+05:30 IST