ఆత్మరక్షణకు కరాటే అవసరం

ABN , First Publish Date - 2020-03-16T06:18:29+05:30 IST

ఆత్మరక్షణకు కరాటే ఉప యోగపడుతుందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఆత్మరక్షణకు కరాటే అవసరం

ఆమనగల్లు: ఆత్మరక్షణకు కరాటే ఉప యోగపడుతుందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్యార్థు లు ప్రాథమిక దశ నుంచే కరాటే నేర్చుకోవాలని సూచించారు. పట్టణంలోని కల్యాణి గా ర్డెన్‌లో ఆదివారం విక్టరీ షోటోఖాన్‌ కరాటే అ కాడమి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. శ్రీ నివాస్‌రెడ్డి, వీఎ్‌సకేఏఐ ఫౌండర్‌, కరాటే గ్రాం డ్‌ మాస్టర్‌ మల్లికార్జున్‌గౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఆర్గనైజర్‌ మాస్టర్‌ మ హేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 2020 కరాటే పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాం తా ల నుంచి విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మహిళలు, యువతులు, విద్యార్థినులకు కరాటే సాధన అవసరమన్నారు. కరాటే ద్వారా తమను తాము రక్షించుకోవచ్చన్నారు. మహిళల సంక్షేమం, రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక వికాసం కలుగుతాయన్నారు. యువత వీటిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కరాటే గ్రా ండ్‌ మాస్టర్లు కేశవ్‌గౌడ్‌, శ్రీనివాస్‌, సాయికిర ణ్‌, ప్రసాద్‌, పృథ్వీ, రవి, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రూపం వెంకట్‌రెడ్డి, సురమల్ల సు భాష్‌, నాగులు, రవి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T06:18:29+05:30 IST