-
-
Home » Telangana » Rangareddy » GOA TOURIST TAKEN TO GANDHI HOSPITAL
-
గోవా నుంచి వచ్చిన ప్రయాణికుల ఆసుపత్రికి తరలింపు
ABN , First Publish Date - 2020-03-23T06:25:45+05:30 IST
కరోనా వైర్‌సను అరికట్టేందుకు చేపట్టిన ప్రయత్నాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు. ప్రతీ రోజు గోవా నుంచి బీజాపూర్ రహదారిలో...

కొడంగల్: కరోనా వైర్‌సను అరికట్టేందుకు చేపట్టిన ప్రయత్నాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు. ప్రతీ రోజు గోవా నుంచి బీజాపూర్ రహదారిలో కొడంగల్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకునే ట్రావెల్స్ బస్సులు ఆదివారం రావుల్‌పల్లి చెక్‌పోస్టుకు చేరుకున్నాయి. అంతర్రాష్ట్ర రహదారి చెక్‌పోస్టు దగ్గర డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగేశ్వర్‌రావు, తహసీల్దార్ కిరణ్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గోవా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రెండు ట్రావెల్స్ బస్సులను ఆపి అందులో ఉన్న 55 మంది ప్రయాణికులను కొండాపూర్ ఆసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్ కిరణ్‌కుమార్ తెలిపారు. అంతర్రాష్ట్ర రహదారి చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ నారాయణ పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు.