-
-
Home » Telangana » Rangareddy » gmr
-
ఉన్నత దశకు విమానాశ్రయ సేవలు : జీఎంఆర్
ABN , First Publish Date - 2020-11-28T05:24:44+05:30 IST
ఉన్నత దశకు విమానాశ్రయ సేవలు : జీఎంఆర్

- ఎయిర్‌పోర్టులో స్మార్ట్ బ్యాగేజ్ ట్రాలీలు ఏర్పాటు
శంషాబాద్ : ఎయిర్‌పోర్టు సేవల నిర్వహణను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లేందుకు స్మార్ట్ ట్రాలీలను ఏర్పాటు చేసినట్టు జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం స్మార్ట్ బ్యాగేజ్ ట్రాలీలు ప్రారంభించారు. రియల్ టైంలో ప్యాంసింజర్ బ్యాగేజీ కోసం ట్రాలీల ట్రాకింగ్, నిర్వహణ కోసం ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం భారతదేశంలో ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో ఉన్న మూడువేల బ్యాగేజ్ ట్రాలీలను ఎల్‌ఓటీ టెక్నాలజీతో అనుసంధానం చేశామన్నారు. దీంతో ప్రయాణికులు బ్యాగేజ్ ట్రాలీల కోసం ఎదరు చూసే సమయం తగ్గిపోతుందన్నారు. రియల్ టైంలో తగినన్ని ట్రాలీలు ప్రయాణికులకు అందుబాటులో తెచ్చేందుక వీలవుతుందన్నారు. మేనేజ్‌మెంట్ ఎయిర్‌పోర్టులో అవసరమైన చోటికి ట్రాలీలను తరలించడం వలన ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. డిపార్చర్, అరైవల్ ర్యాంపుల వద్ద ఎక్కుగా ట్రాలీలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ విధానంలో ఎంత మంది ప్రయాణం సాగిస్తున్నారనే విషయం కూడా అంచనా వేయొచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.