ఘట్‌కేసర్‌-మౌలాలి ఎంఎంటీఎస్‌ ట్రయల్‌ రన్‌

ABN , First Publish Date - 2020-03-12T06:32:04+05:30 IST

ఘట్‌కేసర్‌ నుండి మౌలాలి వరకు నిర్మించిన ఎంఎంటీఎస్‌ రైల్వే లైన్‌ను దక్షిణమధ్య రైల్వే భద్రత(సేఫ్టీ) విభాగం కమిషనర్‌ శ్రీరాం కిృపాల్‌ బుధవారం తనిఖీ చేసి

ఘట్‌కేసర్‌-మౌలాలి ఎంఎంటీఎస్‌ ట్రయల్‌ రన్‌

ఘట్‌కేసర్‌ : ఘట్‌కేసర్‌ నుండి మౌలాలి వరకు నిర్మించిన ఎంఎంటీఎస్‌ రైల్వే లైన్‌ను దక్షిణమధ్య రైల్వే భద్రత(సేఫ్టీ) విభాగం కమిషనర్‌ శ్రీరాం కిృపాల్‌ బుధవారం తనిఖీ చేసి రైలు పట్టాలను, స్టేషన్‌ను పరిశీలించారు. గతంలో ఘట్‌కేసర్‌ నుంచి మౌలాలి వరకు రెండు నూతన లైన్లను నిర్మించారు. కొంత కాలం క్రితమే ఈ రైల్వే లైన్ల పనులు పూర్తయినా రాకపోకలు చేపట్టలేదు. దీంతో రైల్వే జీఎంతో పాటు అధికారులు ఘట్‌కేసర్‌ నుంచి మౌలాలి వరకు రైల్వే ట్రాక్‌ పనులను పరిశీలించారు. ప్రధానంగా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ లైన్‌ ద్వారా ఘట్‌కేసర్‌ నుంచి సికింద్రాబాద్‌కు తక్కువ సమయంలో ప్రయాణించే అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీ వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ఘట్‌కేసర్‌ మీదుగా నిత్యం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం అదనంగా రెండు ట్రాక్స్‌ అందుబాటులోకి రావడంతో రైళ్ల వేగం పెరగడంతో పాటు సమయం ఆదా కానుంది.

Updated Date - 2020-03-12T06:32:04+05:30 IST