నేటి నుంచి భూసార పరీక్షలు
ABN , First Publish Date - 2020-03-16T06:10:43+05:30 IST
నేటి నుంచి 31 వరకు గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు వ్యవసాయాధికారులు సిద్థమయ్యారు.
బషీరాబాద్: నేటి నుంచి 31 వరకు గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు వ్యవసాయాధికారులు సిద్థమయ్యారు. మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్న ప్రతి రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం రైతులకు పంటల సాగుకు ఎరువులు, రసాయనాల వినియోగంపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తారు.
భూసార పరీక్షలిలా..
భూసార పరీక్షల కోసం పొలాల్లో ఏఈవోలు మట్టిని సేకరిస్తారు. ఏఫ్రిల్ 1 నుంచి 6 వరకు భూసార కేంద్రాలకు మట్టి నమూనాలను పంపిస్తారు. నమూనాలను పరీక్షించిన తర్వాత ఫలితాల వివరాలను ఏఫ్రిల్ 7 నుంచి మే 5 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. మే 6 నుంచి 13 వరకు రైతుల సెల్‌ఫొన్ నంబరుకు సందేశం పంపిస్తారు. తర్వాత రైతు మేళాలు నిర్వహించి మే 18 నుంచి 20 వరకు రైతులకు కార్డు రూపంలో ఫలితాలను జారీ చేయనున్నారు.