ఆమనగల్లులో ఘనంగా గ్యారీ షరీఫ్ వేడుకలు
ABN , First Publish Date - 2020-12-02T04:58:34+05:30 IST
ఆమనగల్లులో ఘనంగా గ్యారీ షరీఫ్ వేడుకలు

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలో మహబూబ్ సుభానీ దర్గా వద్ద మంగళవారం గ్యారీషరీఫ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంజుమానే గులమేముస్తఫా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా దర్గా వద్ద మత గురువులు వహీద్అలీ, తాజొద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్యారీ షరీ్ఫకు పూలచదర్ సమర్పించారు. అనంతరం గౌసేపాక్ దర్గా నుంచి జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ముస్తఫా కమిటీ నాయకులు పారూఖ్, ఖలీల్పాషా, రజాక్, అలీం, అబ్బాస్, అంజద్, అక్సర్, నయూమ్, అయూబ్, రావూఫ్, జూనేదా, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.