రోడ్డుపై వ్యర్థాలు వేసినందుకు జరిమానా
ABN , First Publish Date - 2020-12-08T05:10:52+05:30 IST
రోడ్డుపై వ్యర్థాలు వేసినందుకు జరిమానా

ఘట్‌కేసర్: ఘట్‌కేసర్‌లోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల శ్రీవెంకట సాయి క్లినిక్ నిర్వాహకులు వైద్య వ్యర్థాలను రోడ్డుపై వేసినందుకు మున్సిపల్ అధికారులు రూ.2వేలు జరిమానా విధించారు. పట్టణంలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ వసంత రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీవెంకటసాయిక్లినిక్ నిర్వాహకులు వైద్యవ్యర్థాలతోపాటు చెత్తాచెదారాన్ని రోడ్డుపై వేయడాన్ని గమనించారు. వెంటనే క్లినిక్ యజమానిని పిలిపించి రూ.2వేలు జరిమానా విధించడంతో పాటు రోడ్డు పైన వేసిన చెత్తను తిరిగి క్లినిక్ ముందు పోయించారు. రోడ్లపై చెత్తవేస్తే జరిమానాలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.