పంచాయతీకి నిధులు ఇప్పించండి
ABN , First Publish Date - 2020-09-14T10:03:04+05:30 IST
జనాభా లెక్కల ప్రకారం పంచాయతీకి రావాల్సిన నిధులను ఇప్పించాలని కొర్విచెడ్‌ఘని సర్పంచ్ రాథోడ్ సునీతాసేవ్యానాయక్, ఎంపీటీసీ వడ్డే శ్రీను, వడ్డే
బషీరాబాద్: జనాభా లెక్కల ప్రకారం పంచాయతీకి రావాల్సిన నిధులను ఇప్పించాలని కొర్విచెడ్‌ఘని సర్పంచ్ రాథోడ్ సునీతాసేవ్యానాయక్, ఎంపీటీసీ వడ్డే శ్రీను, వడ్డే హన్మంతు కోరారు. నవాంద్గీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీలో 1700 జనాభా ఉండగా ఇందులో సుమారు 950 మంది బీసీ ఓటర్లు ఉన్నరన్నారు. వీరి పేర్లు ఉమ్మడి పంచాయతీ కొర్విచెడ్‌లో నమోదై ఉండటంతో జనాభా ప్రాతిపదికన కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే తలసరి గ్రాంటు రావడంలేదన్నారు. సమస్యను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.