జర భద్రం!

ABN , First Publish Date - 2020-10-28T10:10:27+05:30 IST

కుంభవృష్టి వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయి. అలుగులు, వాగులు ప్రవహిస్తునే ఉన్నాయి. భూగర్భజల మట్టం పెరిగి పంట పొలాలు సైతం జాలువారుతున్నాయి.

జర భద్రం!

నిండిన చెరువులు, కుంటల వద్ద పిల్లలకు పొంచి ఉన్న ముప్పు

పెద్దలు, పిల్లల అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ


షాద్‌నగర్‌ అర్బన్‌: కుంభవృష్టి వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయి. అలుగులు, వాగులు ప్రవహిస్తునే ఉన్నాయి. భూగర్భజల మట్టం పెరిగి పంట పొలాలు సైతం జాలువారుతున్నాయి. వ్యవసా య బోర్లు నుంచి నీరు ఉప్పొంగుతోంది. షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని చిన్న కుంటలతో పాటు చెరవులు నిండి అలుగు పారుతున్నా యి. చెరువులు, కుంటల్లోని నీటిని చూడగానే అందులో ఆడుకోవాల న్న సరదా పిల్లల్లో ఏర్పడుతుంది. ఈతరాని పిల్లలు ఆడుకోవడానికి నీటిలో దిగితే ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. ఈత వచ్చిన వారు సైతం కొన్నిసార్లు మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. చెరువులు, కుంటలు ఎంత లోతు ఉంటాయో తెలియదు. పె ౖగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గోతులు తీస్తు న్నారు. దీంతో సరదాగా వాటిల్లోకి దిగిన వారు ప్రా ణాలు కోల్పోతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అప్ర మత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చు.


పూర్తిగా నిండిన చెరువులు

కొన్నేళ్లుగా వర్షాలు తక్కువపడటంతో దశాబ్దాల పాటు చెరువులు ఎండిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంత పిల్లలు చాలా మంది ఈత నేర్చుకోలేదు. చెరవుల్లోని ఒండ్రు మట్టిని రైతులు పొలాల్లోకి తరలించారు. అలాగే నిర్మాణ రంగానికి, ఇతర అవసరాలకు మొరాన్ని తరలించడంతో చెరువుల్లో భారీ గుంతలు ఏర్పాడ్డా యి. ఇలా అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంట లు ప్రమాదకరంగా మారాయి. ఈత రాని పిల్లలు చెరువులు కుంటల్లోకి వెళ్లితే వాటిల్లోని గోతుల్లో మునిగిపోయి, ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దలు లేకుండా చెరువులు, కు ంటల్లోకి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కొంత సమ యాన్ని కేటాయించి, పిల్లలకు ఈత నేర్పిం చాలి. పిల్లలకు ఈత నేర్పించడానికి నీటితో నిండిన చెరువులు, కుంటలు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి. బావుల్లో ఈత నేర్చుకునేకంటే చెరువు ఒడ్డు ప్రాంతాల్లో నేర్చుకోవడం సురక్షితం. పిల్లలు చెరువుల లోపలికి వెళ్లకుండా పెద్దలు పర్యవేక్షిస్తుండాలి.

Updated Date - 2020-10-28T10:10:27+05:30 IST