ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ABN , First Publish Date - 2020-03-16T06:06:39+05:30 IST
జమాతే హులీమా వికారాబాద్ జిల్లా శాఖ, వీఐఎన్‌ఎన్ హాస్పిటల్ బేగంపేట్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మహా స్పందన లభించింది.
3,500 మంది హాజరు
తాండూరు : జమాతే హులీమా వికారాబాద్ జిల్లా శాఖ, వీఐఎన్‌ఎన్ హాస్పిటల్ బేగంపేట్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మహా స్పందన లభించింది. ఆదివారం తాండూరు పట్టణం నేషనల్ గార్డెన్‌లో నిర్వహించిన ఈ శిబిరానికి 3,500 మందికి హెల్త్ కార్డులను అందజేశారు. 50శాతం రాయితీ కింద కార్డు పొందిన వారు బేగంపేట్ వీఐఎన్‌ఎన్ ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చునని ఆస్పత్రి నిర్వాహకులు వివరించారు.
1700 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వివరించారు. కాలుష్య నివారణలో భాగంగా ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన వాటిని కూడా పరీక్షించారు. వీఐఎన్‌ఎన్ హాస్పిటల్ కో-ఆర్డినేటర్లు రాజేష్, శ్రీనివాస్, ముజ్తబ్ హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముస్తాఫా, వికారాబాద్ జిల్లా జమాతే హులీమా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ అజర్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.