నోట్లోంచి డబ్బులు తీస్తానని..

ABN , First Publish Date - 2020-12-07T04:41:45+05:30 IST

నోట్లోంచి డబ్బులు తీస్తానని..

నోట్లోంచి డబ్బులు తీస్తానని..

  • ముగ్గురు మహిళల నుంచి వెండి కడియాలు, బాలికను ఎత్తుకెళ్లిన నిందితుడు
  • కూకట్‌పల్లి వద్ద బాలిక ఆచూకీ లభ్యం

శంషాబాద్‌ : తన నోట్లోంచి డబ్బులు తీస్తానని ముగ్గురు మహిళలను నమ్మించి వారితో పాటు ఉన్న బాలికను ఎత్తుకెళ్లి బురిడీ కొట్టించిన సంఘటన ఆదివారం శంషాబాద్‌లో వెలుగుచూసింది. నిందితుడి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా నగరంలోని కూకట్‌పల్లి వద్ద బాలికను గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నందిగామ మండలం అప్పారెడ్డిగూడకు చెందిన ముగ్గురు మహిళలకు కొత్తూరు కల్లు కంపౌండ్‌ వద్ద దాదాపు 30 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు గొప్ప శక్తులు ఉన్నాయని నోట్లోంచి డబ్బులు వస్తాయని వారిని నమ్మించాడు. అతని మాటలను నమ్మిన ఆ ముగ్గురు మహిళలు అతనితో పాటు శంషాబాద్‌కు వచ్చి కల్లుసేవించారు. అయితే పూజచేసి డబ్బులు తీస్తానని, కల్లుసేవించినందున ముగ్గు రు మహిళలు దూరంగా ఉండాలని చెప్పాడు. బాలికను తనతో పంపితే ఆమెకు డబ్బులు ఇచ్చి పంపుతానని నమ్మించాడు. మహిళల వద్ద ఉన్న 30 తులాల వెండి కాళ్లకడియాలతో పాటు బాలికను తీసుకుని పారిపోయాడు. అతని కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో బాధిత మహిళలు ఆదివారం ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నాలుగు ప్రత్యేక పోలీసులు బృందాలు కూకట్‌పల్లి ప్రాంతంలో బాలికను గుర్తించి ఆమెను తమ వెంటతీసుకొచ్చి బాధిత కుటుంబీకులకు అప్పగించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more