అట్టహాసంగా పుష్పయాగం

ABN , First Publish Date - 2020-12-14T04:53:55+05:30 IST

అట్టహాసంగా పుష్పయాగం

అట్టహాసంగా పుష్పయాగం
పుష్పయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, బక్కని నర్సింహులు

  • హాజరైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి
  • ముగిసిన పవిత్రోత్సవాలు

షాద్‌నగర్‌ అర్బన్‌: షాద్‌నగర్‌ పట్టణానికి ముఖద్వారంగా వెలిసిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామి పుష్పాభిషేకాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ఉత్సవాల ముగింపు రోజు హోమాలు, మహాపూర్ణాహుతి, వేంకటేశ్వరస్వామికి శతఘట కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం సతీసమేతుడైన వేంకటేశ్వ రస్వామి ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ప్రధాన పూజారి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేలు వై.అంజయ్యయాదవ్‌, ప్రకా్‌షగౌడ్‌, మాజీ మంత్రి డాక్టర్‌ పి.శంకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వి.నారాయణరెడ్డి, కౌన్సిలర్లు టి.ప్రతా్‌పరెడ్డి, కె.అంతయ్య, ఈగ వెంకట్‌రాంరెడ్డి, ఈశ్వర్‌ రాజు, ఎంపీటీసీ బి.రామకృష్ణ, ఉత్సవ నిర్వాహక సభ్యులు పలబట్ల బాల్‌రాజ్‌గుప్తా, పి.వెంకటసాయిశ్వర్‌రెడ్డి, గజవాడ నర్సింహులు, సూరిశెట్టి నర్సింహులు, వేముల బాల్‌రాజ్‌గుప్తా, సురేంద్ర, కానుగు రాంభూపాల్‌, మధు, బి.వేణుగోపాల్‌, గంధం శేఖర్‌, రాయల శంకర్‌, వి.కిషోర్‌, ఎన్‌.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:53:55+05:30 IST