పల్లెలకు నిధుల వరద

ABN , First Publish Date - 2020-07-10T10:06:33+05:30 IST

పల్లెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. గ్రామపంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌కు కూడా

పల్లెలకు నిధుల వరద

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

ఎస్సీ, ఎస్టీ కాలనీలకూ ప్రత్యేక నిధులు

గ్రామ పంచాయతీలకు 85 శాతం..

మండలాలకు 10శాతం, జడ్పీలకు 5 శాతం కేటాయింపు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)/తాండూరు : పల్లెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. గ్రామపంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌కు కూడా కేటాయించారు. మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌లకు 5శాతం, గ్రామపంచాయతీలకు 85శాతం నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. వేతనాలకు తప్ప మిగతా పనులకు ఈ నిధులను వాడుకోవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడిరంగారెడ్డి జిల్లాకు రూ.27కోట్ల 4లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందులో జడ్పీలకు 90,10,500, మండల పరిషత్‌లకు రూ.1,80,20,900, గ్రామ పంచాయతీలకు రూ.24కోట్ల 34లక్షల 29వేలు పైచిలుకు నిధులు మంజూరయ్యాయి.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రూ.27.04 కోట్ల నిధులు

వికారాబాద్‌ జిల్లా పరిషత్‌కు జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.29,03,800, ఎస్సీఎస్పీ కింద రూ.6,57,800, టీఎ్‌సపీ కింద రూ.2,88,400, మేడ్చల్‌ జిల్లా పరిషత్‌కు జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.5,51,900, ఎస్సీఎస్పీ కింద రూ.1లక్ష 4వేల 500, టీఎ్‌సపీ కింద రూ.21,800, రంగారెడ్డి జిల్లా పరిషత్‌కు జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.33,81,400, ఎస్సీఎస్పీ కింద రూ.7లక్షల 76వేల 900, టీఎ్‌సపీ కింద రూ.3.24 లక్షలు మంజూరయ్యాయి. 


మండల పరిషత్‌లకు 10శాతం..

వికారాబాద్‌ జిల్లాలో మండల పరిషత్‌లకు జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.58లక్షల 7వేల 400, ఎస్సీఎస్పీ కింద రూ.1లక్ష 31వేల 560, టీఎ్‌సపీ కింద రూ.5లక్షల 76వేల 700, మేడ్చల్‌ జిల్లాకు జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.11లక్షల 3వేల 700, ఎస్సీఎస్పీ కింద రూ.2లక్షల 9వేలు, టీఎ్‌సపీ కింద రూ.43వేల 500, రంగారెడ్డి జిల్లా జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.67లక్షల 62వేల 600, ఎస్సీఎస్పీ కింద రూ.15లక్షల 53వేల 900, టీఎ్‌సపీ కింద రూ.6లక్షల 48వేల 500 మంజూరయ్యాయి. 


పంచాయతీల్లో నిబంధనల మేరకు వాడాలి

వికారాబాద్‌ జిల్లా గ్రామ పంచాయతీలకు జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.7 కోట్ల 84 లక్షల 47వేలు, ఎస్సీఎస్పీ కింద రూ.1కోటి 77లక్షల 71వెయ్యి, టీఎ్‌సపీ కింద రూ.77లక్షల 89 వేల 300 మంజూరయ్యాయి. మేడ్చల్‌ జిల్లాకు జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.1కోటీ 49లక్షల 8400, ఎస్సీఎస్పీ కింద రూ.28లక్షల 25వేల 800, టీఎ్‌సపీ కింద రూ.5లక్షల 89వేలు, రంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు జనరల్‌ కాంపోనెంట్‌ కింద రూ.9కోట్ల 13లక్షల 49వేల 900, ఎస్సీఎస్పీ కింద రూ.2కోట్ల98 లక్షల 8వేల 900, టీఎ్‌సపీ కింద రూ.8కోట్ల 76లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులను నిబంధనల మేరకు వాడాలని, నిబంధనలకు విరుద్ధంగా వాడితే చర్యలుంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-10T10:06:33+05:30 IST