31వరకు విమాన సర్వీసులు రద్దు

ABN , First Publish Date - 2020-03-23T06:18:47+05:30 IST

నేటి (సోమవారం) నుంచి ఈనెల 31వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వర్గాలు ఆదివారం ఒక...

31వరకు విమాన సర్వీసులు రద్దు

శంషాబాద్‌రూరల్‌: నేటి (సోమవారం) నుంచి ఈనెల 31వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రయాణికులెవనై ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ఎయిర్‌లైన్స్‌ అధికారులు వెల్లడించారు.


కరోనా వైరస్‌ ప్రభావం లేక ముందు ప్రతిరోజు 70 అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు సాగించేవని చెప్పారు. అయితే వైరస్‌ ప్రభావంతో  నెలరోజుల నుంచి దాదాపు ప్రతిరోజూ 30 అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు సాగించేవని ఎయిర్‌ పోర్టు వర్గాలు వెల్లడించారు. అయితే స్వదేశీ విమానాల రాకపోకలు యథా తథంగా కొనసాగుతాయన్నారు. 

Updated Date - 2020-03-23T06:18:47+05:30 IST