ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2020-12-31T05:02:53+05:30 IST

ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి

ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి
ఫిట్‌ ఇండియా సమావేశంలో మాట్లాడుతున్న బలరామారావు

మేడ్చల్‌ అర్బన్‌ : వి ద్యార్థులు, యువత ఫిట్‌నె్‌సపై దృష్టి సారించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారా వు అన్నారు. ఫిట్‌ ఇండియాలో భాగంగా బుధవారం ఫిట్‌నెస్‌ కా డోస్‌ - ఆధాగంటా రోజ్‌.. అం టూ కీసర, భోగారం ఉన్నత పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఫిట్‌ ఇండియా యాప్‌లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శారీరక దారుఢ్యంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని, మంచి ఆలోచనలు ఉంటాయన్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడాన్ని యువత, విద్యార్థులు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. తర్వాత ఫిట్‌ ఇండియా క్విజ్‌ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T05:02:53+05:30 IST