రైతులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-08-20T10:10:39+05:30 IST

వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో వెంకటేశం అన్నారు. బుధవారం మన్‌మర్రి గ్రామంలో నల్లరేగడి పొలాల్లో పత్తి పంటను పరిశీలించారు

రైతులు అప్రమత్తంగా ఉండాలి

షాబాద్‌ : వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో వెంకటేశం అన్నారు. బుధవారం మన్‌మర్రి గ్రామంలో నల్లరేగడి పొలాల్లో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పత్తి పంటలో వడల తెగులు వస్తున్నందున్న పొలాల్లో నీరు నిలువకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలతో దెబ్బతినకుండా రైతులు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈవో, రైతులు ఉన్నారు. 

Read more