దేశానికి రైతే వెన్నెముక

ABN , First Publish Date - 2020-12-29T04:49:04+05:30 IST

దేశానికి రైతే వెన్నెముక

దేశానికి రైతే వెన్నెముక
జనవాడలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య

  • రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి 

శంకర్‌పల్లి: దేశానికి రైతు వెన్నెముక లాంటివాడని, రైతు లేనిదే రాజ్యం లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం శంకర్‌పల్లి మండల గ్రామాలు, మున్సిపాలిటీలో రూ.7.30కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి నిర్వహించారు. దొంతాన్‌పల్లి, గోపులారం, పిల్లిగుండ్ల గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామసంతలు, పంచాయతీ భవనాలు, పర్వేద, మోకిలలో రైతువేదికలు, పశువైద్యశాల భవనం, మున్సిపాలిటీ పరిధి బుల్కాపూర్‌, సింగాపూర్‌, బంగ్లగడ్డ, 14వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైయినేజీ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సాత విజయలక్ష్మిప్రవీణ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు బుచ్చిరెడ్డి, శశిధర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ వెంకటరాంరెడ్డి, మార్కెట్‌ కమిటీల మాజీ చైర్మన్లు రాజునాయక్‌, వెంకటరెడ్డి, కౌన్సిలర్లు బొడ్డు లావణ్యశ్రీనివా్‌సరెడ్డి, పార్శి రాధబాలకృష్ణ, శ్వేతపాండురంగారెడ్డి, చంద్రమౌళి, సంతో్‌షకుమార్‌, చాకలి అశోక్‌, రాములు, లక్ష్మమ్మరాంరెడ్డి, సర్పంచ్‌లు లలితనర్సింహ, రవీందర్‌గౌడ్‌, పి.శ్రీనివాస్‌, నర్సింహారెడ్డి, అశ్వినిసుధాకర్‌, సత్యనారాయణరెడ్డి, అలివేలు, ఇందిరలక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కొన్ని గ్రామాల్లో రభస చోటుచేసుకుంది. మిర్జాగూడలో పంచాయతీ భవనాన్ని తన స్థలంలో నిర్మించొద్దని ఓ వ్యక్తి మంత్రితో అన్నాడు. మోకిల రైతువేదిక శిలాపలకంలో క్లస్టర్‌ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీల పేర్లు రాయలేదని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పీఆర్‌డీఈ జగన్‌రెడ్డి, ఏవో కృష్ణవేణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమకు సంబంధం లేదని అధికారులు అన్నారు.


మహేశ్వరంలో డిగ్రీ, ఐటీఐ కళాశాలల ఏర్పాటుకు కృషి

మహేశ్వరం: మహేశ్వరంలో త్వరలో డిగ్రీ, ఐటీఐ కళాశాలలు,  మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని విద్యా శాఖమంత్రి పి.సబితారెడ్డి అన్నారు. ఉపసర్పంచ్‌ దోమ శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ ఎంఏ సమీర్‌ సోమవారం మంత్రిని నగరంలోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఈ విషయం తెలిపారు. వారితో మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం వాసుల కల త్వరలోనే నెరవేరనుందని, నిర్మాణాలకు స్థల సేకరణ చేయాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు ఆజమ్‌, మైసయ్య ఉన్నారు.

Updated Date - 2020-12-29T04:49:04+05:30 IST