ఒకరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం
ABN , First Publish Date - 2020-12-16T05:07:05+05:30 IST
ఒకరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం
తలకొండపల్లి : ఒకరి నేత్ర దానంతో ఇద్దరికి దృష్టి బాగ్యం కలుగుతుందని చంద్రదన సర్పంచ్ బక్కి కుమార్ అన్నారు. తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామంలో మంగళవారం లైఫ్ ఫర్ ది పీపుల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు. డాక్టర్ చంద్రారెడ్డి, సునీతలు 98 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. నేత్ర సంరక్షణ, నేత్రదానంపై స్థానికులకు అవగాహన కల్పించారు. నేత్ర, రక్త, అవయవ దానాలపై ప్రజలు అపోహలు వీడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, ఎదిరే వెంకటేశ్, రాణి, రాజు యాదవ్, రేణుకాయాదయ్య, కృష్ణవేణి, యాదగిరిగౌడ్, చైతన్యరామకృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.