దెబ్బతిన్న పత్తిచేల పరిశీలన
ABN , First Publish Date - 2020-11-03T09:54:35+05:30 IST
మూడుచింతలపల్లి మండలం కొల్తూర్‌లో ఇటీవల వర్షానికి దెబ్బతిన్న పత్తిచేలను ఎంసీపల్లి వ్యవసాయాధికారి కృష్ణవేణి సోమవారం పరిశీలించారు
శామీర్‌పేట రూరల్ : మూడుచింతలపల్లి మండలం కొల్తూర్‌లో ఇటీవల వర్షానికి దెబ్బతిన్న పత్తిచేలను ఎంసీపల్లి వ్యవసాయాధికారి కృష్ణవేణి సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా అధిక వర్షాల వలన పత్తి తేమగా ఉంటుందని ఎండ వచ్చే సమయంలో పత్తిని ఏరిన తర్వాత ప్లాస్టిక్ కవర్లపై ఆరబెట్టాలని సూచించారు. పత్తి పంటకు నల్లమచ్చ, కాయకుళ్లు తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం కంది పంట పూత, కాయ దశలో ఉన్నందున ఇటీవల కురిసిన వర్షాల వలన కందిలో ఆకుముడత, మచ్చల పురుగు, శనగపచ్చ, ఈకరెక్క పురుగులు ఆశించి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో జ్యోతి, రైతులు రాంరెడ్డి, నారంరెడ్డి పాల్గొన్నారు.