అంతా అప్రమత్తం..లాక్‌డౌన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2020-03-30T11:40:09+05:30 IST

చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌లో ఆదివారం లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది.

అంతా అప్రమత్తం..లాక్‌డౌన్‌ విజయవంతం

నిర్మానుష్యంగా శ్రీశైలం-హైద్రాబాద్‌ జాతీయ రహదారి

సామాజిక దూరంపై అధికారులు , ప్రజాప్రతినిధుల అవగాహన

మున్సిపల్‌ ,పంచాయతీల ఆధ్వర్యంలో శానిటైజేషన్‌

చేవెళ్లలో రహదారుల దిగ్బంధం 

కిక్కిరిసిన కూరగాయల మార్కెట్లు


 చేవెళ్ల / శంకర్‌పల్లి, /షాబాద్‌ / మొయినాబాద్‌ / మొయినాబాద్‌ రూరల్‌: చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌లో ఆదివారం లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది.  పోలీస్‌లు రహదారులను దిగ్బంధం చేశారు. ఆదివారం ఆయాగ్రామాల సర్పంచ్‌లు ట్రాక్టర్‌తో మందును పిచికారిచేయించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా హైరదాబాద్‌ -బీజాపూర్‌ జాతీయ రహదారులు  నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వాహనలను పోలీస్‌లు వెనక్కి పంపించారు. చేవెళ్ల మండల కేంద్రంలో అన్ని రకాల కూరగాయలు ఒకే చోట అమ్మెవిధంగా పోలీస్‌లు ఏర్పాట్లు చేశారు. షాబాద్‌ జెడ్పీటీసీ  అవినాష్‌రెడ్డి సీఎం సహయనిధికి రూ.2లక్షల చెక్కును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు అందించారు. తిమ్మరెడ్డిగూడలో సర్పంచ్‌ శకుంతల, సీఐ శంకరయ్య ఆధ్వర్యంలో హండ్‌వాష్‌, మాస్కులను పంపిణీ చేశారు.


శంషాబాద్‌లో 7వ రోజు లాక్‌డౌన్‌

శంషాబాద్‌/శంషాబాద్‌రూరల్‌:శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో ఆదివారం 7వ రోజు లాక్‌ డౌన్‌ ప్రశాంతగా కొనసాగింది. ఆదివారం కావడంతో భారీసంఖ్యలో కొనుగోలుదారులంతా కూరగా యల మార్కెట్‌కు వచ్చారు. దీంతో మార్కెట్‌ కిక్కిరిసింది. సొంతూళ్లకు నడిచి వెలుతున్న వారికి శంషాబాద్‌లోని నామా మణికంఠ సోదరులు ఆదివారం అల్పాహారం అందజేశారు. రాజేంద్రనగర్‌లోని బ్రింటిప్‌ కాలనీలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆ కాలనీ అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్‌  ఖాజాహైమద్‌ ఆదివారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దషాపూర్‌ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. స్థానిక ఎంపీటీసీ చెక్కల ఎల్లయ్యముదిరాజ్‌తో కలిసి ఆయన శానిటేషన్‌ పనులను ప్రారంభించారు. కరోనాను అదికట్టేందుకు నర్కూడ అమ్మ పల్లి శ్రీసీతారామచం ద్రస్వామి దేవాలయంలో ఆదివారం వేదపండితులు హోమం నిర్వహించారు.


 మహేశ్వరంలో...

మహేశ్వరం: కరోనా కట్టడికి ప్రజలు మరిన్ని జాగ్రత్త లు తీసుకోవాలని మహేశ్వరం ఎంపీపీ కె.రఘుమారెడ్డి అన్నారు.రామచంద్రగూడలో సర్పంచ్‌ ఆంగోత్‌ శివరాజునా యక్‌ ప్రజలకు పాలు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ను అడ్డంపెట్టుకొని ఆయా గ్రామాల్లో వేసిన కంచె వద్ద నిత్యవసరాల కోసం, హాస్పిటల్‌కు వెళ్లే వారిని ఇబ్బం దులకు గురిచేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ వెంకన్ననాయక్‌ హెచ్చరించారు.  


బయటకు వస్తే కఠిన చర్యలు 

షాద్‌నగర్‌/షాద్‌నగర్‌రూరల్‌ : షాద్‌నగర్‌లో ఏడోరోజు లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ట్రైనీ ఐపీఎస్‌ రితిరాజ్‌ హెచ్చరిం చారు. ఫరూఖ్‌నగర్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.చించోడ్‌, కమ్మదనం, రంగదాముల తదితర గ్రామాల్లో సర్పం చులు బాలమణి దామోదర్‌, నర్సింలు ఆదివారం ట్రాక్టర్ల ద్వారా వీధుల్లో మందును పిచికారి చేయించారు. 


కొత్తూర్‌లో...   

కొత్తూర్‌: మండలంలో ఉదయం వేళ మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగొలు చేశారు. ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


కొందుర్గులో... 

కొందుర్గు: మండలంలో లాక్‌డౌన్‌ ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. మండల పరిధిలోని పులుసుమామిడిలో రోడ్డుకు అడ్డంగా వేసిన ముళ్ల కంచెను ఆదివారం గ్రామ సర్పంచ్‌ షరీఫాబేగం జాహంగీర్‌, ఉపసర్పంచ్‌ ఎం నర్సింలు తొలగించారు.


కేశంపేటలో...

కేశంపేట:మండలంలో ఆదివారం పుట్టోనిగూడ, కొండారెడ్డిపల్లి, సంతాపూర్‌, తొమ్మిదిరేకులలో సర్పంచులు క్రిమిసంహారక మందును స్ర్పే చేయించారు.


నందిగామలో...

నందిగామ: మండలంలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. కొత్తూర్‌లో తిమ్మాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌, వంశీ, పోలీసులు, ప్రజ లకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. 


చౌదరిగూడలో..

చౌదరిగూడ: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం లాక్‌డౌన్‌ అతంత మాత్రంగానే కొనసాగింది. అధికారులు, పొలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రజలురోడ్లపైన తిరిగారు. ఇంద్రానగర్‌, గుర్రంపల్లి గ్రామాల్లో బహిరంగంగానే పేకాట ఆడుతున్నా పట్టించుకునే వారేలేరని ప్రజలు వాపోయారు.


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో ఆదివారం లాక్‌డౌన్‌ ప్రశాతంగా కొనసాగింది. ఇప్పటికే నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారి సహ లింకు రోడ్లపై స్టాపర్లను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప వాహనదారులను అనుతించడంలేదు. కూరగాయల మార్కెట్లు, మటన్‌ దుకాణాల వ్దద సామాజిక దూరాన్ని పాటించే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. 


యాచారంలో..

 యాచారం: యాచారంలో 25 కుటుంబాలకు ఎంపీపీ సుకన్యబాషా, సర్పంచ్‌ శ్రీదర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌  లలితాజంగయ్యగౌడ్‌లు బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేశారు.


మంచాలలో..

మంచాల: కరోనాను అరికట్టేం దుకు నిర్విరామంగా పనిచేస్తున్న యంత్రాంగానికి  ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రినిరంజన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. పంచా యతీ కార్మికులు, ఆశావర్కర్లకు ఎంఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా 300 మందికి ఆయన రూ.1000 చొప్పున అందజేశారు. మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.


ప్రతి ఒక్కరూ సహకరించాలి

కందుకూరు: కరోనాను నియంత్రిచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీపీ జ్యోతి కోరారు. ఆదివారం కొత్తగూడ, జైత్వారం, పులిమా మిడి, ధన్నారం, చిప్పలపల్లి గ్రామాల్లో ఆయ గ్రామాల సర్పంచ్‌లు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. కూరగాయలు అమ్ముకునే వ్యాపారులకు తహసీల్దార్‌ ఎస్‌ జ్యోతి, సిఐ జంగయ్య కరోనాపై అవగాహన కల్పించారు. కందుకూరు పోలీసు సిబ్బందికి వారు మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేశారు. దాసర్లపల్లి సర్పంచ్‌ పి.బాల మణి, ఎంపీటీసీ టి.ఇందిరమ్మలు గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు.


లాక్‌డౌన్‌ విజయవంతం

ఆమనగల్లు: శ్రీశైలం-హైరాబాద్‌ జాతీయ రహదారి నిర్మానుష్యంగా కనిపించింది. ఎస్సైధర్మేష్‌ ప్రజలు, వ్యాపారులకు సామాజిక దూరంపై అవగాహన కల్పిం చారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్య, కమిషనర్‌ శ్యాంసుందర్‌లు కౌన్సిలర్‌లు, సిబ్బందితో కలిసి మున్సిపాలీటీ పరిఽధిలోని అన్ని వార్డుల్లో, ప్రధాన రహదారులపై సానిటైజేషన్‌ చేయించి, అవగాహన కల్పించారు. పోలెపల్లి, శంకర్‌కొండ తండాల్లో రోడ్లకు 


అడ్డంగా వేసిన కంపచెట్లు, రాళ్ళను ఎంపీటీసీ కుమార్‌ ,ఉప సర్పంచ్‌ ప్రశాంత్‌ తొలగించారు. 

కడ్తాల్‌: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆదివారం లాక్‌డౌన్‌ అమలుకు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. పోచమ్మగడ్డ తండా, పులేరుబోడు తండా, జమ్ములబాయి తండాలో జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌ కరోనాపై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఎక్వాయిపల్లి గ్రామంలో ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్‌, మాజీ ఎంపీపీ బుగ్గయ్యగౌడ్‌, యాటనర్సింహ అవగాహన కల్పించారు.


తలకొండపల్లి :మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ఉప్పల వెంకటేష్‌ సహకారంతో ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్‌ క్రిమిసంహారక మందు పిచికారి చేయించారు. సర్పంచ్‌ వరలక్ష్మీ రాజేందర్‌రెడ్డి, మీర్‌పేట కార్పొరేటర్‌ భిక్షపతితో కలిసి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెన్నా రం గ్రామంలో మహరాష్ట్ర నుంచి గ్రామానికి చేరుకున్న కూలీలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. 


ఉచితంగా బియ్యం , నిత్యావసరాల పంపిణీ

ఆమనగల్లు: తలకొండపల్లి ఉపసర్పంచ్‌ పద్మ అనిల్‌ ఆదివారం గ్రామంలోని పేదలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో మహేష్‌, బాలకృష్ణ పాల్గొన్నారు. 


అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు 

నిత్యవసర సరుకులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని షాద్‌నగర్‌ డివిజన్‌ కోవిడ్‌-19 స్పెషల్‌ ఆఫీసర్‌, ఏసీపీ వి.శ్యాంబాబు హెచ్చరించారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ను, పలు కిరాణ దుకాణాలను ఆయన ఆదివారం తనీఖీ చేశారు. ఆమనగల్లు  ఎస్సై ధర్మేష్‌, కడ్తాల ఎస్సై సుందరయ్య ,మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌ ,వైస్‌ చైర్మన్‌ భీమనపల్లి దుర్గయ్యలతో కలిసి ఆయావ్యాపారులను ధరలు అడిగి తెలుసుకున్నారు.


మా గ్రామాలకు పంపించండి.. బీహార్‌ కార్మికుల వేడుకోలు

నందిగామ: లాక్‌డౌన్‌ కారణంగా తమకు తినడానికి తిండి కూడా కరువైందనీ, ప్రభుత్వం తమను తమ రాష్ట్రానికి పంపించాలని బీహార్‌కు చెందిన 250 మంది కార్మికులు కోరారు. దీంతో వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని షాద్‌ నగర్‌ ఏసీపీభరోసా ఇచ్చారు. ఏసీపీ వెంట షాద్‌నగర్‌ రూరల్‌సీఐ రామకృష్ణ, నంది గామ ఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు. 

Updated Date - 2020-03-30T11:40:09+05:30 IST