ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి

ABN , First Publish Date - 2020-10-24T10:34:10+05:30 IST

ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి, సురక్ష బీమా చేయించుకొని ధీమాగా ఉండాలని ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నవీన్‌ అన్నారు

ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి

షాబాద్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నవీన్‌


షాబాద్‌: ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి, సురక్ష బీమా చేయించుకొని ధీమాగా ఉండాలని ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నవీన్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆస్పల్లిగూడలో ఎస్‌బీఐ కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ వద్ద గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజలకు అనుగుణంగా ఉండేలా ఎస్‌బీఐ పాయింట్‌లో బీమా పథకాలు, క్రాప్‌లోన్‌ రెన్యూవల్‌ చేస్తున్నామన్నారు. జీవన్‌జ్యోతి పాలసీకి ఏడాదికి రూ.330, సురక్ష బీమా యోజనకు రూ.12 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌బీఐ పాయింట్‌ నిర్వాహకులు నవనీతశివరాజ్‌గౌడ్‌, బ్యాంక్‌ సిబ్బంది శ్రీనివాస్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T10:34:10+05:30 IST