నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలి

ABN , First Publish Date - 2020-07-28T09:59:37+05:30 IST

నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనీతారెడ్డి అన్నారు.

నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలి

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి


కందుకూరు/కడ్తాల: నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనీతారెడ్డి అన్నారు. సోమవారం ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ జంగారెడ్డిలతో కలిసి కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల, గూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిని పల్లెప్రకృతి వనాల్లో వారు మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శమంత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, ఎండీవో  క్రిష్ణకుమారి, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మధన్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ శ్రీలక్ష్మీ, ఎంపీటీసీలు, ఎల్లారెడ్డి, మల్లేష్‌ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో రేషన్‌ డీలర్లకు మంజూరైన కమీషన్‌ డబ్బును జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాయల చైర్మన్‌ పాండు రంగారెడ్డి, నాయకులు, రేషన్‌షాపు డీలర్లు పాల్గొన్నారు.


కడ్తాలలో మంత్రి సబితకు ఘన స్వాగతం

కడ్తాల మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేం దుకు వచ్చిన మంత్రి సబితాఇంద్రారెడ్డికి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీ కమ్లీ మోత్యనాయక్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మినర్సింహారెడ్డి, వైస్‌ఎంపీపీ ఆనంద్‌, పూల మొక్కలు బహూకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా కడ్తాలలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, 30 పడకల ఆసుపత్రి, 108 అంబులెన్స్‌, బస్టాండ్‌, బీసీ గురుకుల పాఠశాలకు భవన నిర్మాణం, గ్రంథాలయం ఏర్పాటు గురించి సర్పంచ్‌ ఎల్‌ఎన్‌.రెడ్డి, ఏబీవీపీ నాయకులు దోనాదుల మహేశ్‌, భగీరథ్‌ వినతి పత్రాలు అందజేశారు.


స్వాగతం పలికిన వారిలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, రామకృష్ణ, ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి, లాయక్‌అలీ, భిక్షపతి, భాస్కర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, హన్మనాయక్‌ ఉన్నారు. అదేవిధంగా ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన కమీషన్‌ రూ.4.11లక్షల చెక్కును మంత్రి సబితారెడ్డి రేషన్‌డీలర్లకు అందజేశారు. అనంతరం మంత్రి కడ్తాల జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ను పరామర్శించారు. ఇటీవల ఆయన కుమారుడు రాథాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా పల్లెప్రకృతి వనం ప్రారంభోత్సవం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌ బాబా మంత్రి ఎదుట బైఠాయించారు. శిలాఫలకంపై తన పేరు ఎందుకు వేయలేదో చెప్పాలన్నారు. ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కావని ఉన్నతాధికారులు, నాయకులు జహంగీర్‌ బాబాకు నచ్చజెప్పారు. 

Updated Date - 2020-07-28T09:59:37+05:30 IST