-
-
Home » Telangana » Rangareddy » enquiry about chairperson Fraud
-
చైర్‌పర్సన్ అవినీతి ఆరోపణలపై విచారణ
ABN , First Publish Date - 2020-12-29T04:45:53+05:30 IST
చైర్‌పర్సన్ అవినీతి ఆరోపణలపై విచారణ

ఆదిభట్ల: ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కొత్త ఆర్థీక, ఆమె భర్త ప్రవీణ్‌గౌడ్‌లపై కౌన్సిలర్లు చేసిన అవినీతి ఆరోపణలపై సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. ప్రవీణగౌడ్ అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పట్ల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు కలెక్టర్‌కు, మున్సిపల్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించారు. డీపీఓ, డీఎల్పీవో, మున్సిపల్ కమిషనర్ సరస్వతి, మేనేజర్ జ్యోతిరెడ్డిలతో కలిసి పది మంది కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్ సభ్యులను విచారణ చేశారు. అనంతరం చైర్‌పర్సన్ ఆర్థీక అభిప్రాయాన్ని రికార్డు చేశారు. రెండు మూడు రోజుల్లో అడిషనల్ కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు.