ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-11-27T05:08:22+05:30 IST

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

మేడ్చల్‌ అర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్‌, కార్యదర్శి ప్రవీణ్‌గౌడ్‌లు అన్నారు. గురువారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌ బీ బ్లాక్‌ వద్ద నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీని ప్రకటించి పాతపెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల నియామకాలు చేపట్టి ప్రమోషన్లు కల్పించాలన్నారు. హెల్త్‌కార్డులు అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో టీఎన్జీవోస్‌ నాయకులు ఈశ్వర్‌, జేమ్స్‌, రవికుమార్‌, గిరికాంత్‌, రఘురాములు, సత్యం, సంజయ్‌, వెంకటేశ్వరరావు, శ్రీకాంత్‌, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:08:22+05:30 IST