ఉద్యోగుల సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2020-05-11T11:12:41+05:30 IST

కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న ఉద్యోగుల సేవలు మరువలేనివని...వారికి ప్రోత్సాహాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ..

ఉద్యోగుల సేవలు మరువలేనివి

మేడ్చల్‌ : కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న ఉద్యోగుల సేవలు మరువలేనివని...వారికి ప్రోత్సాహాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్మిక మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలకు నిర్విరామంగా సేవలందిస్తున్న వారికి ఆది వారం కండ్లకోయలోని నిమ్మలగార్డెన్స్‌లో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన, సహపంక్తి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలసట అనేది లేకుండా వారి ప్రాణాలకు తెగించి కరోనా నివారణకు సేవలందిస్తున్నారన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి పోలీసులు, వైద్యులు, పంచాయతీరాజ్‌, రెవెన్యూశాఖల ఉద్యోగులను శాలువాలతో సత్కరించి అభినందించారు. తర్వాత వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, మర్రి దీపికనర్సింహారెడ్డి, మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, రామస్వామిముదిరాజ్‌, నర్సింహస్వామి, రాజేందర్‌ముదిరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T11:12:41+05:30 IST