విద్యుత్‌ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి

ABN , First Publish Date - 2020-03-24T08:27:27+05:30 IST

తూంకుంట మున్సిపల్‌ పరిధిలోని విద్యుత్‌ వినియోగదారులు బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని శాఖ శామీర్‌పేట డివిజన్‌ ఏడీఈ శంకర్‌ నాయక్‌ సోమవారం...

విద్యుత్‌ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి

శామీర్‌పేట  : తూంకుంట మున్సిపల్‌ పరిధిలోని విద్యుత్‌ వినియోగదారులు బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని శాఖ శామీర్‌పేట డివిజన్‌ ఏడీఈ శంకర్‌ నాయక్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. వినియోగదారులు పేటీఎమ్‌, ఎస్‌పీడీసీఎల్‌ బిల్‌ డెస్క్‌, టీవాలెట్‌, తదితర ఆన్‌లైన్‌ సేవల ద్వారా బిల్లులను చెల్లించాలని వెల్లడించారు.  

Read more