-
-
Home » Telangana » Rangareddy » election
-
గ్రేటర్ ప్రచారంలో నిమగ్నం
ABN , First Publish Date - 2020-11-27T05:30:00+05:30 IST
గ్రేటర్ ప్రచారంలో నిమగ్నం

ఘట్‌కేసర్/ఘట్‌కేసర్ రూరల్: గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీఆర్‌ఎస్ మండల నాయకులు నగరబాట పట్టి ప్రచారంలో నిమగ్నమయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్ హబ్సీగూడ డివిజన్ అభ్యర్థి భేతి స్వప్నారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకలు ఉప్పల్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వామపక్ష పార్టీల నాయకులు సైతం నగరానికి ప్రచారబాట పట్టారు. ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీలతోపాటు చౌదరిగూడ పంచాయతీల ప్రజాప్రతినిధులు సైతం ప్రచారానికి తరలివెళ్లారు. ఆదివారం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు స్థానికంగా ఉండే అవకాశాలున్నాయి. కాగా ముఖ్య నాయకులకు పోలింగ్ ముగిసేదాకా బాధ్యతలు అప్పగించనున్నారని పార్టీశ్రేణులు తెలిపారు. అదేవిధంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి మలిపెద్ది సుఽధీర్‌రెడ్డికి హబ్సీగూడ డివిజన్ ఇన్‌చార్జి బాఽధ్యతలు అప్పగించడంతో మండలంతో పాటు పోచారం, ఘట్‌కేసర్ మున్సిపాలిటీల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రచారానికి తరలివెళ్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి భేతి స్వప్నాసుభా్‌షరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి ఎంతమంది నాయకులు వస్తున్నారు? ఎక్కడెక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారనే విషయాలను ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నాయకులు ఉదయం 7గంటలకు హబ్సీగూడ చేరుకొని ఇన్‌చార్జి సూచించిన ప్రదేశాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటే్‌షగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, ఉపసర్పంచ్ రాజు, నరేష్, నాయకులు దుర్గారాజుగౌడ్, సాయికుమార్, ఆనంద్, రవి, చంద్రమౌళి, శంకర్ పాల్గొన్నారు.
జోరుగా మేడ్చల్ నాయకుల ప్రచారం
మేడ్చల్ రూరల్: మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలతో పాటు మేడ్చల్ మండల నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తరలివెళ్లడంతో మేడ్చల్‌లో రాజకీయ నాయకుల హడావుడి పూర్తిగా తగ్గిపోయింది. నేడు, రేపు కూడా గ్రేటర్ ఎన్నికల్లో మేడ్చల్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. నగరశివారులోని కుత్భుల్లాపూర్ పరిధిలోని పలు డివిజన్‌లలో మేడ్చల్ టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం మంత్రి మల్లారెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ కందాడి నరేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ రణదీ్‌పరెడ్డి, మునిరాబాద్ సర్పంచ్ గణేష్ తదితరులు తమ అనుచరులతో ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రచారంలో పాల్గొన్న శామీర్‌పేట నాయకులు
శామీర్‌పేట: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి శామీర్‌పేట నుంచి నాయకులు తరలివెళ్లారు. హబ్సీగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా సుధాకర్‌రెడ్డిని గెలిపించాలని మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని బృందావన్ నగర్‌లో అభ్యర్థి ఉమా సుధాకర్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్, కీసర మండలం గోధుమకుంట ఎంపీటీసీ కిరణ్‌జ్యోతి ప్రవీణ్‌కుమార్, మేడ్చల్ నాయకులు వినోద్‌గౌడ్, రవితేజ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127వ డివిజన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయ్‌శేఖర్‌గౌడ్‌తో కలిసి గురుమూర్తి నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.