రాచలూరులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ABN , First Publish Date - 2020-12-31T04:57:17+05:30 IST

రాచలూరులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

రాచలూరులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
కాలిన వస్తు సామగ్రి

కందుకూరు : కందుకూరు మండలం రాచలూరులో బుధవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఫకీర్‌దేవమ్మ పెంకుటిల్లు కాలి దగ్ధమైంది. దాంతో ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదుతో పాటు విలువైన పత్రాలు కాలి బూడిదయ్యాయని బాధిత కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మాజీ సర్పంచ్‌ బాబు పరామర్శించారు. ఈసందర్భంగా జంగారెడ్డి రూ.5,000 ఆర్థికసాయం అందజేశారు.

Updated Date - 2020-12-31T04:57:17+05:30 IST