కరోనాకు ఎనిమిది మంది బలి

ABN , First Publish Date - 2020-09-01T08:43:17+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 8మంది కరోనా బారినపడి మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

కరోనాకు ఎనిమిది మంది బలి

రంగారెడ్డి జిల్లాలో ఐదుగురు, మేడ్చల్‌లో ముగ్గురు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 8మంది కరోనా బారినపడి మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో ఐదుగురు, మేడ్చల్‌ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 205కు చేరుకుంది.

948 కేసులు : ఉమ్మడి జిల్లాలో సోమవారం 948 కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 497, మేడ్చల్‌ జిల్లాలో 425, వికారాబాద్‌ జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. 


రంగారెడ్డి జిల్లాలో..

ఇబ్రహీంపట్నం / యాచారం/ కందుకూరు / షాద్‌నగర్‌ / ఆమనగల్లు / చేవెళ్ల / శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని 11కేంద్రాల్లో కరోనా టెస్టులు నిర్వహించగా 156మందికి పాజిటివ్‌ వచ్చింది. యాచారం మండల కేంద్రంలో 111మందికి కరోనా పరీక్షలు చేయగా 20మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 58మందికి కరోనా పరీక్షలు చేయగా 9మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో అన్నోజి గూడలో ఇద్దరు, నేదునూరు, కందుకూరు, రావిరాల, ఘట్‌కేసర్‌, కర్మన్‌గట్‌, కొలన్‌గూడలకు చెందిన ఒక్కొక్కరున్నారు.


షాద్‌నగర్‌ డివిజన్‌లో 360 మందికి కరోనా పరీక్షలు చేయగా 41 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌లో 5, ఫరూఖ్‌నగర్‌ మండలంలో 16, నందిగామ మండలంలో 11 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇతర మండలాల్లో మిగతా 9 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఆమనగల్లు, కడ్తాల, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ ప్రాంతాలకు చెందిన 55 మందికి కరోనా పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఆమనగల్లులో 6, ఇబ్రహీంపట్నంలో 1 కేసులు వచ్చాయి. చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 376 మందికి  కరోనా పరీక్షలు చేయగా 64మందికి పాజిటివ్‌ వచ్చింది. శంషాబాద్‌ మున్సి పాలిటీలో 75 మందికి కరోనా పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్‌గా తేలింది.


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి / ధారూరు / పరిగి/ దోమ : వికారాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. సోమవారం వికారాబాద్‌లో 10, పరిగిలో 6, తాండూరులో 3, నవాబుపేటలో 2, ధారూరు, బంట్వారం, యాలాల్‌, బొంరా్‌సపేట్‌, కోట్‌పల్లి మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది. 

ధారూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 11మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. మున్నూరుసోమారం గ్రామానికి చెందిన వ్యక్తికి (30) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 39 మందికి కరోనా పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. పరిగి మార్కెట్‌యార్డు ప్రాంతంలో 4, హౌజింగ్‌బోర్డుకాలనీలో  1, గడిసింగాపూర్‌లో 1 కేసు నమోదైంది. 

దోమ మండలంలో 24మందికి కరోనా టెస్టులు చేయగా  కమ్మంనాచారం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ పీహెచ్‌సీపరిధిలో 11మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి పాజి టివ్‌ వచ్చిందని వైద్యాధికారి మంజుల తెలిపారు. 

Updated Date - 2020-09-01T08:43:17+05:30 IST