గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-09-16T05:53:56+05:30 IST

గ్రేటర్‌ పరిధిలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌ మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి

మేడ్చల్‌: గ్రేటర్‌ పరిధిలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌ మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రాంమోహన్‌లను కలిసి కోరారు. గ్రేటర్‌లోని గ్రంథాలయాలను అన్ని విధాలా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు తమవంతుగా సహకారం అందించాలని ఈ సందర్భంగా వారిని కోరినట్లు భాస్కర్‌యాదవ్‌ తెలిపారు. మంత్రులు, మేయర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-09-16T05:53:56+05:30 IST