డంపింగ్‌యార్డు, వైకుంఠధామం పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-11-27T05:22:48+05:30 IST

డంపింగ్‌యార్డు, వైకుంఠధామం పనులు పూర్తిచేయాలి

డంపింగ్‌యార్డు, వైకుంఠధామం పనులు పూర్తిచేయాలి
అంకిరెడ్డిపల్లిలో పర్యటించిన అదనపు కలెక్టర్‌

కీసర: గ్రామాల్లో ఏర్పాట్టు చేసే డంపింగ్‌యార్డు, వైకుంఠధామం పనులు త్వరగా  పూర్తి చేయాలని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం, డంపింగ్‌యార్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో పద్మాజారాణీ, సర్పంచ్‌ విమల, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:22:48+05:30 IST