-
-
Home » Telangana » Rangareddy » Double bedroom homes need to be completed quickly
-
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-06-23T09:37:02+05:30 IST
డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం మునిసిపల్ పరిధిలోని 19వ వార్డు

వికారాబాద్ : డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం మునిసిపల్ పరిధిలోని 19వ వార్డు రామయ్యగూడ సమీపంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణంలో భాగంగా కాంక్రీట్, సిమెంట్‌వర్క్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ మంజులారమేష్, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్ శంషాద్‌బేగం, మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, డీఈఈ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ నర్సిములు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
కేసీఆర్‌పై నమ్మకంతోనే పార్టీలోకి...
సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో నాయకులు టీఆర్‌ఎస్ వైపు వస్తున్నారని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండల వైస్ ఎంపీపీ కొండి రాములు, మదన్‌పల్లి కాంగ్రెస్ నాయకులు, రాంరెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, రాములు, మధు, కృష్ణ, నర్సిములు, మల్లయ్య, సుభాష్, శ్యామల్‌రెడ్డి, అశోక్, నర్సిములు, కృష్ణ, పోచయ్య, శ్రీనివాస్, యాదయ్య, శేఖర్, రాములు, నర్సింహ్మారెడ్డి తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మంజుల, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, నవీన్ పాల్గొన్నారు.