పాఠశాలకు ఫర్నిచర్‌ అందజేత

ABN , First Publish Date - 2020-02-08T11:39:10+05:30 IST

మండల పరిధిలోని చెర్లపేటల్‌గూడ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్‌, మోదీ బిల్డర్స్‌ శుక్రవారం రూ.2.5 లక్షల విలువ చేసే డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలు, 10

పాఠశాలకు ఫర్నిచర్‌ అందజేత

ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని చెర్లపేటల్‌గూడ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్‌, మోదీ బిల్డర్స్‌ శుక్రవారం రూ.2.5 లక్షల విలువ చేసే డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలు, 10 కుర్చీలు, రెండు బీరువాలు, ఆరు టేబుళ్లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌  గీతారాంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు దాతల సహకారం మురువలేనిదన్నారు. ఎంఈవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ఉత్తమ బోధన అందజేస్తున్నా మన్నారు. ఆయన మోదీ బిల్డర్స్‌ ప్రతినిధులను అభినందించారు. కాగా,  ఉపాధ్యాయుడు రఘునాథ్‌ ఈ ఏడాది విద్యార్థులకు అవసరమైన నోట్‌ పుస్తకాలు, భోజనం చేయడానికి పేనట్లు అందజేశారు. కార్యక్రమంలో మోదీ బిల్డర్స్‌ మేనేజర్‌ డీబీ.రావు, ఉపసర్పంచ్‌ నరేందర్‌, ఎస్‌ఎంసీ చైర్మెన్‌ శ్రీరాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T11:39:10+05:30 IST