రక్తదానం చేయండి.. ప్రాణదాతలుకండి
ABN , First Publish Date - 2020-09-03T09:06:15+05:30 IST
రక్తదానం చేయండి.. ప్రాణదాతలవ్వండి.. అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు...

ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ : రక్తదానం చేయండి.. ప్రాణదాతలవ్వండి.. అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన బ్లడ్ బ్యాంక్‌ను బుధవారం నాడాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ప్రజలకు రక్తం కొరతను తీర్చేందుకే ఇక్కడ బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. గర్భిణులు, కిడ్నీ, తలసేమియా తదితర వ్యాధులతో బాధపడేవారు రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినధులు, నాయకులు ముత్యంరెడ్డి, విజయ్‌కుమార్, శుభప్రద్‌పటేల్, మల్లికార్జున్, యాదయ్య, ప్రభాకర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, హఫీజ్, చిగుళ్లపల్లి రమేష్, సురేష్ పాల్గొన్నారు.