వలస కార్మికులకు చేయూత

ABN , First Publish Date - 2020-04-01T11:29:42+05:30 IST

లాక్‌డౌన్‌ వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో దాదాపుగా 2లక్షల మంది

వలస కార్మికులకు చేయూత

మేడ్చల్‌ జిల్లాలో ఆరు పునరావాస కేంద్రాల ఏర్పాటు 

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పర్యవేక్షణ 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లాప్రతినిధి) : లాక్‌డౌన్‌ వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో దాదాపుగా 2లక్షల మంది కార్మికులు ఉన్నారు. వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులు సొంతూళ్లకు వెళ్లలేక స్థానికంగా ఉండలేక సతమతమవుతున్నారు. అయితే జిల్లాలో 14,411మంది వలస కార్మికులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు జిల్లాలో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసింది.


ఎన్‌హెచ్‌ 44 పరిధిలో మేడ్చల్‌, కొంపల్లి, రామగుండం రహదారి పరిధిలో తూంకుంట, నర్సాపూర్‌ రోడ్డు పరిధిలో దుండిగల్‌, ముంబాయి ప్రధాన రోడ్డు పరిధిలోని వారిని నిజాంపేట్‌లో, వరంగల్‌ హైవే పరిధిలోని వారికి పీర్జాదీగూడలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి టిఫిన్లు, భోజనాలు అందజేస్తున్నారు. క్యాంపుల్లోనూ భౌతికంగా దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు దుండిగల్‌, ఘట్‌కేసర్‌ తదతర క్యాంపు కార్యాలయాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు పలు మండలాల్లో పూటగడవక ఇబ్బందులు పడుతున్న కూలీలకు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు చేయూతనందిస్తున్నారు.  

Updated Date - 2020-04-01T11:29:42+05:30 IST