ఫిర్యాదులపై డీఎల్‌పీవో విచారణ

ABN , First Publish Date - 2020-12-20T04:46:27+05:30 IST

ఫిర్యాదులపై డీఎల్‌పీవో విచారణ

ఫిర్యాదులపై డీఎల్‌పీవో విచారణ

ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలోని అవుషాపూర్‌, ఎదులాబాద్‌ గ్రామాల్లో గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు డీవీవో అదేశాల మేరకు డీఎల్‌పీవో స్మిత విచారణ చేపట్టారు. అవుషాపూర్‌లో గతనెల 9న పంచాయతీ సభ్యులు కవాడి శిరీష వామన్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, కవాడి కుశలవరెడ్డి, డొంకెని సంధ్య, మాజీసర్పంచ్‌ పెద్దోళ్ల రమేష్‌, మాజీ వార్డుసభ్యుడు శంకర్‌గౌడ్‌లు జిల్లా పంచాయతీ అధికారికి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. దీంతో డీపీవో ఆదేశాల మేరకు డీఎల్‌పీవో స్మిత విచారణ చేపట్టారు. తుది నివేదిక తయారుచేసి జిల్లా అధికారులకు పంపించనున్నట్లు స్మిత తెలిపారు. ఎదులాబాద్‌ రెవెన్యూ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా ఫామ్‌లాండ్‌ వెంచర్‌ చేశారని పంచాయతీసభ్యులు డీపీవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎల్‌పీవో విచారణ చేపట్టారు. 

Read more