జిల్లా నోడల్‌అధికారి ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2020-07-18T10:11:20+05:30 IST

మోమిన్‌పేట మండలంలో సీఆర్‌డీఏ స్టేట్‌ప్రాజెక్ట్‌ , జిల్లానోడల్‌అధి కారి మురళీ శుక్రవారం ఆకస్మిక పర్యటన చేశారు.

జిల్లా నోడల్‌అధికారి ఆకస్మిక తనిఖీ

మోమిన్‌పేట: మోమిన్‌పేట మండలంలో సీఆర్‌డీఏ స్టేట్‌ప్రాజెక్ట్‌ , జిల్లానోడల్‌అధి కారి మురళీ శుక్రవారం ఆకస్మిక పర్యటన చేశారు. బాల్‌రెడ్డిగూడెం, మొరంగపల్లి, మోమి న్‌పేట, కాస్లాబాద్‌ గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ, ఆయా గ్రామాల్లో పనులు బాగా జరుగుతున్నాయని సర్పంచులను ప్రశంసించారు. అనంతరం ప్రకృతివనాలు, నూర్పిడి కల్లాల స్థలాలను పరిశీలించారు. పెండింగ్‌ పనులను పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ అధికారి స్టీఫెన్‌నిల్‌, ఎంపీడీవో శైలజారెడ్డి, ఏపీవో శంకరయ్య, ఎంపీవో యాదగిరి, ఈసీవికాస్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులు మాధవి, నర్సిములు, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-18T10:11:20+05:30 IST