వినూత్నంగా ఇంటర్ విద్యావ్యవస్థ
ABN , First Publish Date - 2020-12-21T04:03:17+05:30 IST
వినూత్నంగా ఇంటర్ విద్యావ్యవస్థ

ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్
వికారాబాద్ : ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను వినూత్నంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళింగ కృష్ణకుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల, ప్రిన్సిపాళ్ల సంఘాల సంయుక్త సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఇంటర్ విద్యావ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం వికారాబాద్ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేశ్వర స్వామి, ఉపాధ్యక్షుడు సాయినాథ్, కార్యదర్శి బుచ్చయ్య, సంయుక్త కార్యదర్శి మల్లినాథప్ప, ఆర్థిక కార్యదర్శి గురుపాదప్ప, ఈసీ సభ్యుడిగా పండరి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు చెన్నయ్య వ్యవహరించారు. అనంతరం జిల్లా జీజేసీ ప్రిన్సిపాళ్ల సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెన్నయ్య, ఉపాధ్యక్షుడిగా రాజ్‌మోహన్, కార్యదర్శిగా నర్సింహారెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా కుమారస్వామి, మహిళా కార్యదర్శిగా శోభారాణి, ఈసీ మెంబర్లుగా శంకర్, రజిత ఎన్నికయ్యారు. ఎన్నికల అఽధికారిగా మెదక్ జిల్లా ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు అవనీ్‌షరెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథి కళింగ కృష్ణకుమార్‌ను, ఎన్నికల అధికారి అవనీ్‌షరెడ్డిని ఆయా సంఘాల నాయ కులు శాలువ, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.