-
-
Home » Telangana » Rangareddy » Dictatorial rule in the state
-
రాష్ట్రంలో నియంత పాలన
ABN , First Publish Date - 2020-12-29T04:48:22+05:30 IST
రాష్ట్రంలో నియంత పాలన

పరిగి:రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతపాలనను కొనసాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి బక్కని నర్సింహులు ఆరోపించారు. సోమవారం పరిగిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రయ్య నివాసంలో ఆయనతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో కేసీఆర్‌కే తెలియదని వాఖ్యానించారు. కేంద్రం తీసుకోచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ వారం రోజుల్లో ప్లెటు ఫిరాయించి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఆవిర్భావంతోనే బడుగు వర్గాలో రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపితం చేసే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పి.చంద్రయ్య, నాయకులు వెంకటయ్య, కృష్ణయ్యలు పాల్గొన్నారు.