-
-
Home » Telangana » Rangareddy » dharna
-
ఘంటాఫుడ్స్ కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2020-11-26T05:13:42+05:30 IST
ఘంటాఫుడ్స్ కార్మికుల ధర్నా

యాచారం : కనీస వేతనాలు పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండల పరిధి నందివనపర్తిలోని ఘంటాఫుడ్స్ కంపెనీ కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించి విధులు బహిష్కరించారు. ఘంటాఫుడ్స్ కంపెనీలో 350 మంది కార్మికులు కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తున్నారు. తమకు రోజుకు రూ.350 కూలి ఇస్తున్నారని, వాటిని పెంచాలని డిమాంఢ్ చేశారు. పీఎఫ్ పేరిట వేతనాల నుంచి కొంత డబ్బు కట్ చేస్తున్నా తమ పీఎఫ్ ఖాతాల్లో జమ కావడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికులు ఆసుపత్రికి వెళ్తే ఆరోజు విధులకు గైర్హాజరు అయినట్లు రికార్డుల్లో నమోదు చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని కార్మికులు వాపోయారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాంఢ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.